6జీబీ ర్యామ్‌తో సామ్‌సంగ్‌ ‘సీ9 ప్రొ’

9

భువనేశ్వర్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ సామ్‌సంగ్‌ గెలాక్సీ సీ9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బాలీవుడ్‌ నటి ప్రాచీ దేశాయ్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ను భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ నెల 27 నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.36,900గా కంపెనీ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. నలుపు, బంగారు వర్ణాల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. 6జీబీ ర్యామ్‌తో సామ్‌సంగ్‌ నుంచి విడుదలైన తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. .

ఫోన్‌ ఫీచర్లు..

* 6 అంగుళాల తాకే తెర
* ఆండ్రాయిడ్‌ 6.0
* 16 మెగాపిక్సెల్‌ ముందు, వెనుక కెమెరాలు
* 64జీబీ అంతర్గత మెమొరీ
* మెమొరీ కార్డు సదుపాయంతో 256జీబీ వరకు పెంచుకోవచ్చు
* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here