సరస్సుపై తేలియాడే పాఠశాల

7

ఇంఫాల్‌: దేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అయిన మణిపూర్‌లోని లోక్‌తక్‌ ఇప్పుడు ఓ ప్రాథమిక పాఠశాలకు నెలవైంది. సరస్సు పాఠశాలగా మారడమేంటని ఆలోచిస్తున్నారా? మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కి 50 కి.మీ. దూరంలో ఉన్న ఈ సరస్సుపై పెద్ద బల్లకట్టు ఏర్పాటుచేసి దాని మీద ఓ పాక నిర్మించారు. అందులో పిల్లలకి, అక్షరజ్ఞానం లేని ఆ చుట్టు పక్కల ప్రాంతాల పెద్దలకు కూడా పాఠాలు చెబుతున్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 25 మంది విద్యార్థులు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. స్థానిక కమ్యూనిటీల అభివృద్ధి లక్ష్యంగా దీన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ పనిచేసే వాలంటీర్లకు పీఆర్‌డీఏ గౌరవ వేతనం చెల్లిస్తుంది. యాక్షన్‌ ఎయిడ్‌ ఇండియా ఆర్థిక సహాయంతో ఈ ప్రాజెక్ట్‌ నిర్వహిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here