శశికళ ఆత్మహత్య వార్త

7

తమిళనాట పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. అయితే, ఆలస్యం అయ్యే కొద్దీ పన్నీరు సెల్వం వర్గం ఆనందం, శశికళ వర్గంలో నిరాశ ఎక్కువుతూ వస్తోంది. ఎంపీలు క్రమంగా పన్నీరు ప్రక్కన చేరుతున్నారు. తనకి సీఎం పీఠం దక్కకుండా కేంద్ర కుట్ర చేస్తోందని శశికళ తీవ్ర ఆందోళనకి గురవుతున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శశికళకి సీఎం పీఠం దక్కకుంటే.. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మేరకు ఆమె గవర్నర్ కి లేఖ రాశారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

శశికళ ఆత్మహత్య న్యూస్ వైరల్ గా మారడంతో.. దీనిపై ఆమె స్పందించింది. తన ఆత్మహత్య వార్తలో వాస్తవం లేదని ఖండించింది. ఇక, అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం కొత్తేమీ కాదని, పార్టీలో సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కొంటామని శశికళ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మహిళ కొనసాగడం ఎంతో కష్టం.. ఇలాంటి కష్టాలెన్నింటినో జయలలిత అధిగమించారు. ఇప్పుడు తాము కూడా అలాగే ఈ సవాళ్లను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు శశికళ.

ఇక, ఆలస్యం అయ్యేకొద్దీ పన్నీరు పంచాన చేరే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరో 11మంది ఎమ్మెల్యేలని పన్నీరు వర్గం వైపు వస్తే.. శశికళ సీఎం పీఠం ఆశలు వదులుకోవాల్సిందే.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here