వాట్ ఎ ప్రి లుక్ పోస్టర్

6

గత ఏడాది నాలుగో క్వార్టర్లో రెండు మరపురాని విజయాల్ని అందుకున్నాడు నారా రోహిత్. నాగశౌర్య కాంబినేషన్లో చేసిన ‘జ్యో అచ్యుతానంద.. శ్రీవిష్ణుతో కలిసి చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’.. రెండూ కూడా విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాయి. అలాగే కమర్షియల్ గానూ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడిక రోహిత్ సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అతను కథానాయకుడిగా రాబోతున్న కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’. ఈ రోజే ఈ చిత్ర ప్రి లుక్ పోస్టర్ రిలీజైంది. చూడగానే ఆహ్లాదకరంగా.. అందంగా అనిపిస్తూ మనసు దోచేలా ఉంది‘ కథలో రాజకుమారి’ ప్రి లుక్  పోస్టర్.

టైటిల్ లోగోను డిజైన్ చేయడంలోనే ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. మొత్తం పోస్టర్ ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగిస్తోంది. ‘లవ్ ఇన్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫామ్’ అనే క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు. మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని నిర్మించిన కృష్ణ విజయ్.. ప్రశాంతిలతో పాటు సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య.. మంచు లక్ష్మి క్యామియో రోల్స్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రం మార్చిలో విడుదలయ్యే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here