రావులపాలెం కుండ బిర్యాని

24

ఆంధ్రప్రదేశ్ లోనే అందమైన ప్రదేశం కోనసీమ అటువంటి కోనసీమ లో అందమైన ప్రాంతం “రావులపాలెం”. మనకు భారతదేశంలో గేట్ వే అఫ్ ఇండియా లాగా, రావులపాలెం లో గేట్ వే ఆఫ్ కోనసీమ ముఖ ద్వారం ఉంది. ఈ కోనసీమలో లొకేషన్స్ అద్భుతం గా ఉంటాయి. ఇక్కడ కొబ్బరి తోటలు, అరటి తోటలతో ఎంతో చూడ చక్కగా ఉంటుంది ఈ ప్రదేశం. ఎటు చూసిన పచ్చని చెట్లు మనసుకి ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. అలాగే రావులపాలెం లో తయారుచేసిన కుండ బిర్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అన్ని హోటల్స్ లో ఈ కుండ బిర్యాని దొరుకుతుంది. అలాంటి ఎంతో పేరున్న కుండబిర్యానీ కోసం ఎక్కెడెక్కడునుండో బిర్యానీ ప్రేమికులు వస్తూ ఉంటారు. వెజ్ నాన్ వెజ్ రెండు రకాల్లోనూ దొరికే ఈ కుండ బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవాలంటే..

కావలసినవి::
1.బాస్మతి రైస్ – 50౦ గ్రా.
2.చికెన్ – 500 గ్రా.
3.కోడి గుడ్లు. -రెండు.
4.ఉప్పు – తగినంత.
5.పచ్చిమిర్చి – 6.
6.దాల్చినచెక్క – రెండు.
7.లవంగాలు – 10.
8.యాలకులు – 4.
9.కారం – మూడు స్పూన్స్.
10.ఉల్లిపాయలు. – 4.
11.కొత్తిమీర – కొంచెం.
12.పుదీనా – కొంచెం.
13.నూనె – నాలుగు టేబుల్ స్పూన్స్.
14.గరం మసాలా – ఒక స్పూన్.
15.పెరుగు – 3 స్పూన్స్.

తయారీ విధానం::  ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి, నీళ్ళు పోసి బాగా కాగిన తరువాత అందులో కొంచెం ఉప్పు కొంచెం నూనె పోసి తరువాత బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ హాఫ్ బాయిల్ ఐన తరువాత వడకట్టాలి. అలాగే కోడి గుడ్లు కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలాగా తరుగుకోవాలి. తరువాత ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు ను దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకోని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి పేస్టు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ దంచిన మసాలా దినుసులు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ముందుగా వేయించుకోన్న ఉల్లిపాయ ముక్కలను మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోని బాగా కలపాలి. తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం నీళ్ళు వేసి బాగా కలపాలి. తరువాత కట్ చేసి ఉంచుకొన్న చికెన్ ముక్కలను కుండలో వేసుకోవాలి అలాగే మనం ముందుగ బౌల్ లో మిక్స్ చేసుకున్న పేస్టు ను కూడా కుండలో వేసుకోవాలి. అందులో బాయిల్ చేసుకున్న రైస్ ని, కోడిగుడ్లను కూడా కుండలో వేసుకోవాలి.చివరిగా పైన ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు మరియు కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వెయ్యాలి. దాని పైన సిల్వర్ ఫాయిల్ వేసి మూసుకోవాలి. ఈ కుండ ను పొయ్యి మీద పెట్టి పది నిమిషాలు పాటు హై ఫ్లేమ్ ఉడకనివ్వాలి. తరవాత పొయ్యి ను సిమ్ లో ఐదు నిముషాలు పాటు ఉంచాలి. తరువాత పొయ్యి ఆఫ్ చేసి ఐదు నిముషాలు ఉంచి ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకు ఎంతో ఇష్టం అయిన కుండ బిర్యాని రెడీ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here