బన్నీ కొత్త టైటిల్ తెలుసా..?

13

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వం లో ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే..ఇప్పటికే 60 % షూటింగ్ పూర్తి కావడం తో నెక్స్ట్ చేయబోయే మూవీ ఫై కసరత్తులు మొదలు పెట్టాడు. డీజే పూర్తి కాగానే లింగుస్వామి దర్శకత్వం లో తెలుగు , తమిళ్ భాషలలో తెరకెక్కబోయే చిత్రం లో నటిస్తున్నాడు. దీంతో పాటు స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం లో ఓ మూవీ చేయనున్నాడు..

తాజాగా ఫిలిం సర్కిల్లో ఈ రెండు చిత్రాలకు సంబదించిన ఓ టైటిల్ చక్కర్లు కొడుతుంది. కాకపోతే ఇది ఏ సినిమాకు సంబదించిందో కరెక్ట్ గా తెలియదు కానీ టైటిల్ మాత్రం వైరల్ గా మారింది. ఇంతకీ ఆ టైటిల్ ఏంటి అంటే ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ వినపడుతుంది. మరి ఇది ఏ చిత్రానికి అనుకుంటున్నారో అనేది తెలియదు.

వక్కంతం – బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నాడట..

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here