ప్రభాస్-సుజీత్ సినిమా ప్రారంభం.. రేపే !

7

రెండున్నర యేళ్లుగా ‘బాహుబలి’కి అంకింతం అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇటీవలే ‘బాహుబలి’ నుంచి రిలీజయ్యాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ రెండు ముహూర్తపు డేట్స్ చెప్పాల్సి ఉంది. అందులో ఒకటి ప్రభాస్ పెళ్లి ముహూర్తం. కాగా, రెండోది సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ యాక్షన్ సినిమా ముహూర్తం.

ప్రభాస్ పెళ్లి ముహూర్తం గురించి ఇంకా ఏం చెప్పడం లేదు. ఇంతలో ప్రభాస్ సినిమా ముహూర్తం మాత్రం చెప్పేశాడు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రభాస్ సినిమా రేపు (సోమవారం) ఘనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సుజీత్ నే ప్రకటించాడు.

దాదాపు రూ. 100కోట్లతో ఈ సినిమా యూవీ క్రియేషన్స్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ హీరోయిన్, బాలీవుడ్ విలన్ నటించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీలోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here