నోకియా: నిమిషంలోనే అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌

8

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు బేసిక్‌ ఫోన్ల విపణిలో సంచలనం సృష్టించిన నోకియా మళ్లీ కొత్త హంగులతో ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్ల రూపంలో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. నోకియా బ్రాండ్‌ పేరుతో హెచ్‌ఎండీ గ్లోబల్‌ తాజా ఫోన్లను తయారు చేస్తోంది. శుక్రవారం నోకియా 6ను చైనా విపణిలోకి విడుదల చేశారు. అక్కడి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో జేడీ.కామ్‌ వీటిని విక్రయానికి ఉంచగా, కేవలం ఒకే ఒక నిమిషంలో అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ అని దర్శనమివ్వడం కన్పించింది. ఆండ్రాయిడ్‌ నూగట్‌తో వస్తున్న ఈ ఫోన్‌ విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పది లక్షలమంది దీని కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారంటే నోకియాపై ఎంత క్రేజ్‌ ఉందో వేరే చెప్పనక్కర్లేదు

అత్యాధునిక ఫీచర్లతో విడుదలైన ఈ ఫోన్‌ ధర భారత కరెన్సీలో రూ.17,000 ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశముంది. మరోవైపు ఫిబ్రవరిలో నోకియా బ్రాండ్‌పై మరిన్ని ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్‌ సన్నాహాలు చేస్తోంది.

నోకియా 6 ఫీచర్లు ఇలా ఉన్నాయి
* 5.5అంగుళాల తాకే తెర
* 1.1గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ అంతర్గత మెమొరీ
* ఆండ్రాయిడ్‌ 7.0
* 16 మెగా పిక్సెల్‌ వెనుక కెమేరా
* 8 మెగా పిక్సెల్‌ ముందు కెమేరా
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

Like Us on Facebook : https://www.facebook.com/indianewswala/

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here