నితిన్ చేతిలో కాటమరాయుడు రైట్స్

1

పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి.. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది. ఇప్పటికే యూట్యూబ్ లో 7 మిలియన్ల వ్యూస్ దక్కాయంటే పవర్ స్టార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. ఇప్పుడీ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ మొదలుపెట్టేశారనే విషయం అఫీషియల్ గా కన్ఫాం అయింది.

కాటమరాయుడికి అన్ని ఏరియాల నుంచి భారీ మొత్తాలకే ఆఫర్స్ వస్తున్నాయి. నైజాంలో ఈ సినిమా డీల్ క్లోజ్ అయిపోయింది. ‘నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మూవీ కాటమరాయుడిని నైజాం ఏరియాలో ఏషియన్ ఫిలిమ్స్.. శ్రేష్ట్ మూవీస్ రిలీజ్ చేయబోతున్నాయి’ అంటూ నితిన్ స్వయంగా ట్వీట్ చేయడంతో.. ఈ చిత్ర నైజాం హక్కులు కుర్ర హీరోకి చేతికి వెళ్లాయనే విషయం కన్ఫాం అయిపోయింది. అయితే.. ఎంత మొత్తానికి ఈ రైట్స్ దక్కించుకున్నాడనే విషయాన్ని మాత్రం నితిన్ చెప్పలేదు.

ఇండస్ట్రీ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకూ పవన్ సినిమాలు అన్నింటికంటే.. కాటమరాయుడికే ఎక్కవ ఆఫర్ లభించిందని అంటున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడిపై.. ఓ వారం క్రితం వరకూ పెద్దగా బజ్ లేకపోయినా.. ముప్ఫై సెకన్ల టీజర్.. అందులో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తో.. పవర్ స్టార్ లెక్కలు అన్నీ సరి చేసేశాడని చెప్పుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here