త్వరలోనే కొత్త వంద నోట్లు

9
ముంబయి: రిజర్వు బ్యాంకు త్వరలోనే కొత్త వంద రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురానుంది. కొత్త వంద నోట్లలో అంకెలుండే భాగాల్లో ‘ఆర్‌’ అక్షరం, గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ సంతకం ఉంటాయని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.నోటు వెనకభాగంలో ముద్రణ సంవత్సరం 2017గా ఉంటుందని వెల్లడించింది. మహాత్మాగాంధీ సిరీస్‌-2005లో భాగంగా జారీ చేసే కొత్త నోట్లు గతంలో విడుదల చేసిన వంద రూపాయల నోట్ల తరహాలోనే ఉంటాయని వివరించింది. ఆర్‌బీఐ గతంలో జారీ చేసిన వంద రూపాయల నోట్లన్నీ చెలుబాటవుతాయని స్పష్టం చేసింది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here