డీఎస్‌ఎల్ఆర్ కెమెరాను తలదన్నే స్మార్ట్‌ఫోన్లు!

8

పర్సనల్ కెమెరాలు వాడటం ఒకప్పుడు ఫ్యాషన్. మెడలో ఓ డీఎస్‌ఎల్ఆరో, లేకపోతే జేబులో ఓ డిజిటల్ కెమెరానో పెట్టుకుని తిరిగేవారు ఫొటో లవర్స్. ఇప్పుడు రోజులు మారాయి. చేతిలో సరిగ్గా ఇమడని ఈ కెమెరాలకు బైబై చెప్పుతున్నారు. ఎన్నో విధాలుగా ఉపయోగపడే స్మార్ట్‌ఫోన్లనే కెమెరాలుగా ఉపయోగించేస్తున్నారు. అయితే మార్కెట్లో దొరికే అన్ని స్మార్ట్‌ఫోన్లు మంచి కెమెరాలు కాదు. పేరుకు 20ఎంపీ, 16ఎంపీ అని చెప్పుకొని స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తున్నా వాటి నుంచి వచ్చే ఫొటోలు మాత్రం చాలా నాసిరకంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్లలో మంచి కెమెరాలు కలిగిన, డీఎస్‌ఎల్ఆర్ కెమెరాను సైతం తలదన్నే ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్
12ఎంపీ ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ కెమెరా గెలాక్సీ ఎస్7 సొంతం. f/1.7 అపెర్చ్యూర్, ఎల్‌ఈడీ ఫ్లాస్‌తో కూడిన ఈ కెమెరాతో ఫొటోలు అద్భుతంగా వస్తాయి. అలాగే 4కె వీడియోలో కూడా తీయొచ్చు. ఫేస్, స్మైల్ డిటెక్షన్, హెచ్‌డీఆర్, పనోరమా, జియో ట్యాగింగ్ తదితర ఫీచర్లు ఈ కెమెరాకు ఉన్నాయి. అలాగే f/1.7 అపెర్చ్యూర్‌తో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఈ రెండు ఫోన్లలో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్
సాధారణంగా ఐఫోన్ అంటే ముందుగా గుర్తొచ్చేది కెమెరానే. పేరుకి 12ఎంపీ కెమెరా అయినప్పటికీ ఐఫోన్ 7తో ఫొటోలు అద్భుతంగా వస్తాయి. f/1.8 అపెర్చ్యూర్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌తో 4కె వీడియోలు తీయొచ్చు. f/2.2 అపెర్చ్యూర్‌తో 7ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఐఫోన్ 7లో ఉంది.

గూగుల్ పిక్సెల్, పిక్సెల్ ఎక్సెల్
గూగుల్ ఇటీవల విడుదలచేసిన స్మార్ట్‌ఫోన్లు పిక్సెల్, పిక్సెల్ ఎక్సెల్ కూడా మంచి కెమెరా ఫోన్లు. డ్యుయల్ కెమెరాతో కూడిన 12.3 ఎంపీ కెమెరా వీటి సొంతం. గెలాక్సీ ఎస్7, ఐఫోన్ 7 కన్నా మెరుగైన కెమెరాను దీనిలో వాడారు. f/2.0 అపెర్చ్యూర్, ఫేస్ డిటెక్షన్, లేజర్ ఆటోఫోకస్ తదితర ఫీచర్లున్నాయి. f/2.4 అపెర్చ్యూర్‌తో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా పిక్సెల్‌లో ఉంది.

ఎల్జీ జి5
రెండు వెనుక కెమెరాలు ఎల్జీ జి5 ప్రత్యేకం. లేజర్ ఆటోఫోకస్ కలిగిన 16ఎంపీ (f/1.8 అపెర్చ్యూర్), 8ఎంపీ (f/2.4 అపెర్చ్యూర్) కెమెరాలు వెనుకవైపు అమర్చారు. అలాగే f/2.0 అపెర్చ్యూర్‌తో 8ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

వన్‌ప్లస్ 3
f/2.0 అపెర్చ్యూర్ కలిగిన 16ఎంపీ వెనుక కెమెరా, 8ఎంపీ ముందు కెమెరా వన్‌ప్లస్ 3 సొంతం. ఫేస్ డిటెక్షన్, 4కె వీడియో, ఆటో హెచ్‌డీఆర్ తదితర ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

హువాయి ఆనర్ 8
హువాయి నుంచి వచ్చిన అద్భుతమైన కెమెరా ఫోన్ ఆనర్ 8. f/2.2 అపెర్చ్యూర్‌తో కూడిన రెండు 12ఎంపీ వెనుక కెమెరాలు దీని సొంతం. అలాగే f/2.4 అపెర్చ్యూర్‌తో 8ఎంపీ ఫ్రంట్ షూటర్ ఉంది.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్
ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఫోన్లలో అత్యంత నాణ్యమైన కెమెరా కలిగిన ఫోన్ ఇదేనేమో. దీనిలో వెనుకవైపు 23ఎంపీ (f/2.0 అపెర్చ్యూర్) కెమెరాను అమర్చారు. అలాగే ముందు 13 ఎంపీ (f/2.0 అపెర్చ్యూర్) కెమెరా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/indianewswala/

Tags: 7 smartphones you can ditch your dslr cameras for,  sony xperia xz , Oneplus 3 , LG G5 , Huwei Honor 8 , google pixel and pixel xl , Best camera smartphones , Apple iphone77 smartphones you can ditch your dslr cameras for

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here