జియో ఉచిత సేవలు పొడిగింపు?

12

ముంబయి: ఇప్పటికే ఆరు నెలల పాటు ఉచిత కాల్స్‌, డేటా సేవలు అందిస్తున్న రిలయన్స్‌ జియో తన ఆఫర్‌ను మరో మూడు నెలలు పొడిగించనుందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అయితే తదుపరి తీసుకొచ్చే ఉచిత సేవలకు కొంత రుసుము విధించాలని జియో యోచిస్తున్నట్లు సమాచారం.

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ‘వెల్‌కమ్‌ ఆఫర్‌’ పేరిట ఉచిత సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌’ పేరిట మార్చి 31 వరకు దాన్ని పొడిగించింది. ఇటీవలే 7.2కోట్ల కనెక్షన్ల మైలురాయిని చేరుకున్న ఆ సంస్థ తమ ఖాతాదారులను మరింత పెంచుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం స్వల్ప రుసుముకే డేటా అందించడంతో పాటు ఉచిత కాల్స్‌ను అందించాలని యోచిస్తోంది. కాల్స్‌కు ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని ఇది వరకే కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తీసుకొచ్చే ఆఫర్‌ను కేవలం రూ.100కే అందించాలని జియో యోచిస్తోంది. దీన్ని జూన్‌ 30 వరకు కొనసాగించాలని భావిస్తోంది. ఆఫర్‌ ముగిసేలోగా కాల్‌డ్రాప్‌ సమస్యను పరిష్కరించుకోవాలని జియో భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే జియో దెబ్బకు మిగిలిన టెలికం సంస్థలు డేటా ఛార్జీలను భారీగా తగ్గించాయి. కొన్ని ప్రత్యేక ప్యాక్‌ల ద్వారా ఉచిత కాల్స్‌ సదుపాయాన్నీ ఆయా కంపెనీలు అందిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/indianewswala/

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here