గూగుల్ స్మార్ట్‌వాచ్‌లూ వస్తున్నాయి!

10

ఒకప్పుడు చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే ఎంతో గొప్ప. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అదొక నిత్యవసరం. మాట్లాడటానికి మాత్రమే ఉపయోగపడిన ఫీచర్ ఫోన్లు రానురాను స్మార్ట్‌ఫోన్లుగా మారిపోయాయి. నోకియా, బ్లాక్‌బెర్రీ లాంటి కంపెనీలు మొదట్లో టచ్ ఫోన్‌లు తీసుకొచ్చి మొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఇవి చాలా ఖరీదు కూడా ఉండేవి. కానీ గూగుల్ మొబైల్ రంగంలోకి అడుగుపెట్టాక పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఒక్కసారి స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని తన చేతుల్లోకి లాగేసుకుంది గూగుల్. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనే.

అయితే ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. స్మార్ట్‌వాచ్‌ల హవా మొదలైంది. ఇప్పటికే ఆపిల్, మోటోరోలా, అసుస్, ఇంటెక్స్, సామ్‌సంగ్ తదితర కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసాయి. ఇప్పుడు ఈ కోవలోకి గూగుల్ కూడా చేరిపోయింది. కొన్ని నెలలుగా వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టి స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. వచ్చే ఏడాది రెండు గూగుల్ వాచ్‌లను లాంచ్ చేస్తున్నట్లు ఆండ్రాయిడ్ వేర్ ప్రొడక్ట్ మేనేజర్ జెఫ్ చాంగ్ వెల్లడించారు. ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు ఆండ్రాయి వేర్ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయని ఆయన స్పష్టం చేసారు. గూగుల్, పిక్సెల్ కాకుండా ఒక కొత్త బ్రాండ్‌తో ఈ స్మార్ట్‌వాచ్‌లు తీసుకొస్తున్నట్లు చెప్పారు.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here