కోహ్లి సరికొత్త రికార్డు

4

కోల్కతా: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లి కెప్టెన్గా సరికొత్త రికార్డను నమోదు చేశాడు. ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లి వెయ్యి పరుగుల్ని వేగంగా సాధించిన వన్డే కెప్టెన్గా  గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ ద్వారా 17 ఇన్నింగ్స్ ల్లోనే కోహ్లి కెప్టెన్ వెయ్యి పరుగుల్ని సాధించి దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను వెనక్కినెట్టాడు.

గతంలో ఏబీ డివిలియర్స్ వన్డే కెప్టెన్ గా 18 ఇన్నింగ్స్ ల్లో వెయ్యి పరుగుల్ని సాధించగా, ఆ రికార్డును కోహ్లి సవరించాడు. ప్రస్తుతం పూర్తిస్థాయి కెప్టెన్ గా మూడో వన్డే మాత్రమే ఆడుతున్న కోహ్లి.. అంతకుముందు మహేంద్ర సింగ్ ధోని గైర్హాజరీ సమయంలో 14 వన్డేలకు సారథిగా వ్యవహరించాడు. అయితే భారత్ తరపున అత్యంత వేగంగా వెయ్యి పరుగుల్ని సాధించిన కెప్టెన్ల జాబితాలో సౌరవ్ గంగూలీ ఐదో స్థానంలో ఉన్నాడు.

వేగంగా వెయ్యి పరుగులు సాధించిన వన్డే కెప్టెన్లు

విరాట్ కోహ్లి(భారత్).. 17 ఇన్నింగ్స్ ల్లో

ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా)-18 ఇన్నింగ్స్ ల్లో

కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)-20 ఇన్నింగ్స్ ల్లో

అలెస్టర్ కుక్(ఇంగ్లండ్)- 21 ఇన్నింగ్స్ ల్లో

సౌరవ్ గంగూలీ(భారత్)-22 ఇన్నింగ్స్ ల్లో

Like Us on Facebook : https://www.facebook.com/indianewswala/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here