కుర్రాళ్లకు.. జీతాలే జీతాలు రూ.6 లక్షలకు పైబడిన వేతన ప్యాకేజీల్లో 85% వృద్ధి

6

దిల్లీ: గతేడాదిలో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారికి(ఫ్రెషర్స్‌) మంచి వేతన ప్యాకేజీలు అందాయి. రూ.6 లక్షలకు పైగా వార్షిక వేతన ప్యాకేజీ ఉండే ఉద్యోగాల సంఖ్య గతేడాదిలో ఏకంగా 85 శాతం పెరిగాయని ఓ సర్వే చెబుతోంది. ఉద్యోగ అంచనాల సంస్థ అస్పైరింగ్‌ మైండ్స్‌తో పాటు.. ఉద్యోగార్థుల పోర్టల్‌ మ్యావ్‌క్యాట్‌.కామ్‌ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఆ విశేషాలు..

* 0-2 ఏళ్ల అనుభవం గల వ్యక్తులకు వార్షిక వేతన ప్యాకేజీ రూ.1-30 లక్షల స్థాయిలో ఉంటోంది. చాలా వరకు ప్యాకేజీలు రూ.2-3 లక్షల స్థాయిలో ఉన్నాయి.
* రూ.6 లక్షలకు పైగా వేతన ప్యాకేజీ గల ఆఫర్లు 2015తో పోలిస్తే గతేడాది 85 శాతం పెరిగాయి. భారత్‌లో ఈ తరహా 6000 ఉద్యోగాలకు ఏకంగా 40 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
* వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఆధారంగా మంచి గిరాకీ ఉన్న ఉద్యోగం ఏదైనా ఉందంటే అది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగమే. మొత్తం దరఖాస్తుల్లో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు/వెబ్‌ ఆర్కిటెక్ట్స్‌ ఉద్యోగాల కోసం వచ్చేవి 38 శాతంగా ఉన్నాయి.
* ‘మార్కెటింగ్‌-విక్రయాలు’ రెండో స్థానాన్ని ఆక్రమించింది. మార్కెటింగ్‌ రంగంలోనే చూస్తే డిజిటల్‌ మార్కెటింగ్‌కు అత్యధికంగా 21 శాతం ఉద్యోగాలు లభిస్తుండడం గమనార్హం.
* డాటా, డాటా సైన్స్‌ రంగంలో డాటా అనలిస్ట్‌, డాటా సైంటిస్ట్‌, డాటా ఇంజినీరింగ్‌ల ఉద్యోగాలు అంతక్రితం ఏడాదితో పోలిస్తే గతేడాది 30 శాతానికి పైగా పెరగడం విశేషం.
* సాంకేతిక ఉద్యోగాలతో పోలిస్తే సాంకేతికేతర ఉద్యోగాలైన మార్కెటింగ్‌-విక్రయాలు, కంటెంట్‌ రైటింగ్‌, కమ్యూనికేషన్స్‌, పరిశోధనల్లో కంపెనీలు ఎక్కువ సంఖ్యలో నియామకాలు జరుపుతుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/indianewswala/

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here