ఓం నమో.. ఆరంభం అదరలేదు!!

6

అక్కినేని నాగార్జున- కె. రాఘవేంద్ర రావుల కాంబినేషన్ లో రూపొందిన ఓం నమో వేంకటేశాయ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అన్నమయ్య తర్వాత వెంకటేశ్వరుడు-భక్తుడు థీమ్ తో రూపొందిన సినిమా కావడంతో ఆ స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నాయి. సినిమా పరంగా నాగ్ నిరుత్సాహపరచకపోయినా.. మొదటి రోజు వసూళ్లు మాత్రం బయ్యర్లను నిరుత్సాహపరిచాయి.

ఓం నమో వేంకటేశాయకు తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా కేవలం 2.4 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. నైజాంలో 54 లక్షలు.. ఉత్తరాంధ్రలో 27 లక్షలు.. ఈస్ట్ 17 లక్షలు.. వెస్ట్ 23 లక్షలు.. కృష్ణా 9 లక్షలు.. గుంటూరు 37 లక్షలు.. నెల్లూరు 12 లక్షలు వసూళ్లు రాగా.. మొత్తం ఏపీలో 1.25 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. సీడెడ్ లో కేవలం 26 లక్షలను మాత్రమే ఈ చిత్రం రాబట్టగలిగింది. తెలుగు రాష్ట్రాల్లో 2.05 కోట్ల కలెక్షన్స్ రాగా.. వరల్డ్ వైడ్ గా మిగిలిన ఏరియాల వసూళ్లతో కలిపి 2.4 కోట్లను మాత్రమే ఈ సినిమా రాబట్టగలిగింది.

మనం.. సోగ్గాడే చిన్ని నాయన.. ఊపిరి వంటి వరుస విజయాలతో ఊపు మీదున్న నాగార్జున సినిమాకి తగినట్లుగా ఈ కలెక్షన్స్ లేవు. అయితే.. టాక్ బాగుండడంతో మెల్లగా ఊపందుకుంటుందనే అంచనాలు మాత్రం ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here