ఒబామా తిరిగి అధ్యక్షుడిగా రావాలి సర్వేలో ఎక్కువ మంది అమెరికన్ల మనోగతం

5

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రెండు వారాల్లోపే చాలా మంది అమెరికన్లు బరాక్‌ ఒబామా తిరిగి అధ్యక్షుడిగా రావాలని కోరుకుంటున్నారు. ట్రంప్‌ను తొలగించాలని ఎక్కువమంది ఓటర్లు కోరుకుంటున్నారు. పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఒబామాను అధ్యక్షుడిగా కోరుకుంటున్నట్లు 52శాతం మంది చెప్పారు. ట్రంప్‌ చేతిలో పగ్గాలు ఉండడం పట్ల సంతోషంగా ఉంది 43శాతం మందే. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను సాగనంపాలని ఎక్కువ మంది కోరుకోవడం విశేషమని పబ్లిక్‌ పాలసీ పోలింగ్‌ ప్రెసిడెంట్‌ డీన్‌ డేబ్నం పేర్కొన్నారు. వలసలపై ట్రంప్‌ ఇచ్చిన ఉత్తర్వులకు మద్దతిచ్చిన వారు 47శాతం మంది కాగా వ్యతిరేకించిన వారు 49శాతం మంది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here