ఏపీలోని 13 జిల్లాల్లో ఒకే బంగారం ధర

8

నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బంగారం ఒకే ధర అమలు చేస్తామని ది ఏపీ బులియన్ గోల్డ్‌ సిల్వర్‌, డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్ రాష్ట్ర చీఫ్‌ ఆర్గనైజర్‌ శాంతిలాల్‌ జైన్ తెలిపారు.
ఆదివారం విశాఖపట్నంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిందని, అందులో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇక నుంచి ప్రతిరోజూ బంగారం, వెండి ధరలను రాష్ట్ర సంఘమే వ్యాపారులకు తెలియజేస్తుం దన్నారు.
వ్యాపారులు 916 బంగారు నగలు, 92.5 వెండి ఆభరణాలనే అమ్మాలని సమావేశంలో తీర్మానించామన్నారు.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here