ఈ ఫోన్ ప్రత్యేకత తెలిస్తే అవాక్కవుతారు.. మార్కెట్లో ఇప్పటి వరకు ఇటువంటి ఫోనే లేదు!

17
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ వివో సరికొత్త ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ‘వీ5 ప్లస్’ పేరుతో విడుదల చేయనున్న ఈ ఫోన్‌లో ఉన్న ఓ ప్రత్యేక ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఏ ఫోన్లకు లేదు.
సెల్ఫీలపై యువతకు రోజురోజుకు మోజు పెరుగుతుండడంతో వారిని ఆకట్టుకునేందుకు ‘వీ5 ప్లస్‌’లో రెండు ఫ్రంట్ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీనివల్ల సెల్ఫీలను మరింత నాణ్యంగా తీసుకునే వీలు కలుగుతుందని కంపెనీ పేర్కొంది. జనవరి 23న ఈ ఫోన్‌ భారత మార్కెట్లోకి రానుంది. ధర రూ.27,980. ముందున్న రెండు కెమెరాల్లో ఒకటి 20 మెగాపిక్సల్ ఇమేజ్ సెన్సార్ కాగా మరొకటి 8 మెగా పిక్సల్. వెనకవైపు కెమెరా 16 మెగా పిక్సల్. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 3160 ఏంఏహెచ్ బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్‌ను వీ5 ప్లస్‌లో ఉపయోగించారు.
Tags: V5 Plus
SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here