ఆ బ్రాండ్ కు కోటింగ్ ఇచ్చేశాడు

4

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్.. ప్రస్తుతం కాబిల్ ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్నాడు. పోటీ కారణంగా వసూళ్లలో వెనకబడ్డా.. హృతిక్ యాక్టింగ్ కి బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. ఈ హుషారులో ఉన్న హృతిక్ రోషన్ కి ఓ బ్రాండ్ షాక్ ఇస్తే.. అంతకు మించిన దెబ్బ కొట్టాడు ఈ సూపర్ స్టార్.

లైఫ్ స్టైల్ క్లోతింగ్ బ్రాండ్ ‘టామీ హైఫ్లయర్’ తాజాగా స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ అంటూ కొత్త పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది. ఇందులో హృతిక్ తో పాటు.. తన ఇద్దరు చిన్నారు.. ఆడుకుంటున్నట్లుగా ఉంటుంది. అనుమతి లేకుండా తనతోపాటు కుటుంబాన్ని కూడా టామీ బ్రాండ్ వాడుకోవడం నచ్చని హృతిక్.. స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. ‘డియర్ టామీ.. నేను నీ దుస్తులు వేసుకోను.. నా పిల్లలు కూడా నీకు ప్రచారం చేయడం లేదు. నువ్వు వెన్నెముక కోల్పోతే.. వెతికిపెట్టడానికి నా దగ్గర మంచి టీం ఉంది. దయచేసి నువ్వు వేరేది చూసుకోవడం బెటర్’ అంటూ ట్వీట్ పెట్టాడు హృతిక్ రోషన్.

హృతిక్ ఇచ్చిన కౌంటర్ పై ఆ కంపెనీ స్పందించలేదు. సాధారణంగా ఇలాంటివి జరిగినపుడు అనధికారికంగా ఉపయోగించుకున్నారంటూ కోర్టుకు ఈడ్చి.. నష్ట పరిహారం వసూలు చేస్తుంటారు సెలబ్రిటీలు. కానీ హృతిక్ మాత్రం గంటల వ్యవధిలోనే గట్టి దెబ్బ కొట్టేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here