ఆ ఫోన్‌పై భారీ తగ్గింపు!

5

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ లెనోవో తన ‘జెడ్‌2 ప్లస్‌’ స్మార్ట్‌ఫోన్‌ ధరను భారీగా తగ్గించింది. సోమవారం నుంచి 32 జీబీ వేరియంట్‌ ఫోన్‌ను రూ.14,999కే అందించనున్నట్లు సంస్థ పేర్కొంది. అంతకుముందు ఈ ఫోన్‌ ధర రూ.17,999. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్లలో తెలుపు, నలుపు రంగుల్లో ఈ ఫోన్‌ లభ్యమవుతుందని పేర్కొంది. ఇక 64 జీబీ వేరియంట్‌ ధరను రూ.2500 తగ్గించింది. అంతకుముందు దీని రూ.19,999గా కంపెనీ పేర్కొంది. జెడ్‌2 ప్లస్‌ను గతేడాది సెప్టెంబర్‌లో భారత్‌లో విడుదల చేసింది.

ఫీచర్లు
* 5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
* 3జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 13 ఎంపీ వెనక కెమెరా, 8 ఎంపీ ముందు కెమెరా
* 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
* 6.0.1 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌
* ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌
* 2.15 గిగా హెర్జ్‌ ప్రాసెసర్‌

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here