ఆ ఫోన్లు ఎందుకు కాలిపోయాయో చెప్తాం..

7
గెలాక్సీ నోట్‌ 7పై సామ్‌సంగ్‌ ప్రకటన 23న
ఇంటర్నెట్‌డెస్క్‌: సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లు కాలిపోవడానికి కారణమేమిటో ఈ నెల 23న ప్రకటిస్తామని సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. సామ్‌సంగ్‌ వెబ్‌సైట్‌లో 23న ఈ ప్రకటనను ఇంగ్లిష్‌, చైనీస్‌, కొరియన్‌ భాషల్లో లైవ్‌స్ట్రీమింగ్‌ చేయనున్నారు. ఈ ఘటనలపై జరిపిన దర్యాప్తు వివరాలను సామ్‌సంగ్‌ మొబైల్స్‌ ప్రెసిడెంట్‌ కో డాంగ్‌ జిన్‌ వెల్లడించనున్నారు.మొబైల్‌ ఫోన్ల తయారీలో ప్రముఖ స్థానం పొందిన సామ్‌సంగ్‌ ఆ మధ్య విడుదల చేసిన గెలాక్సీ నోట్‌ 7 ఫోన్లు కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి.

ఛార్జింగ్‌కి పెట్టిన ఫోన్లు పేలినట్లు వార్తలు రావడంతో పలు చోట్ల వాటి వాడకాన్ని నిషేధించారు. దాంతో కంపెనీ ఫోన్లను వెనక్కి తీసుకుంది. వినియోగదారులకు వాటి బదులుగా కొత్త ఫోన్లను ఇచ్చింది. ఫోన్‌ బ్యాటరీ తయారీలో చిన్న లోపం వల్లే ఇలా జరిగిందని సామ్‌సంగ్‌ తొలుత పేర్కొంది. ఈ వ్యవహారం సామ్‌సంగ్‌కి 5 బిలియన్‌ డాలర్ల నష్టం కలిగించింది.దక్షిణ కొరియాకి చెందిన సామ్‌సంగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ లీ జే యాంగ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణాధికారులు ఆయన అరెస్టుకు న్యాయస్థానాన్ని అనుమతి కోరగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్‌ తాజా ప్రకటన ఆసక్తికరంగా మారింది.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here