అభిమానులకు కోహ్లీ సందేశం

3

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ ఎల్లప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉంటాడు భారత యువ క్రికెటర్‌, జట్టు సారథి విరాట్‌ కోహ్లీ.

తాజాగా శనివారం విరాట్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు. అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ సందేశాన్ని అందించాడు. భారత జట్టుకు, తనకు మద్దతుగా నిలుస్తోన్న అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పాడు. తమ వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య చివరి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం ఆటగాళ్లందరూ ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నారు. కెప్టెన్‌ కోహ్లీ పాల్గొనకపోవడంతో… అతన్ని చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో కోహ్లీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులను పలకరించి, ధన్యవాదాలు తెలిపాడు.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here